Wednesday, 1 April 2015

విరించి ll పాత కళేబరం ll
...................................
ఈ కుళ్ళిన పాత కళేబరం కూడా
అపుడపుడూ శ్వాసిస్తుంటుంది

ఇపుడిపుడే పుట్టిన లేలేత శవంలా
రిగర్ మోర్టిస్ ని నటిస్తుంటుంది

తానూ బ్రతికే ఉన్నానంటూ
కంపు తడేదో కింది నుండి చేస్తూ వుంటుంది

అగ్గారిన నిప్పుల కుంపటి నుండి
పంచాగ్నులని స్వయానా ఊదుకుని
మనుషుల్ని ముక్కలుగా కోసి
ఆ అగ్గుల్లో వేపుకు తింటుంది.

ఈ పాత కళేబరాన్ని మోసే
అయోమయం మనుషులకూ
కాలాన్ని పచ్చి చితుకులతో కాల్చే
కాటి కాపర్లకూ జన్మ వైరమే మరి.

సమూహాలుగా నడిచిపోయే
ఈ మనుషుల నీడల చాటున
దాక్కుని దొంగలా పిడికిలి ఎత్తే
ఆ ముదనష్టపు చెయ్యి ఈ కళేబరానిదే..

లే...!! పాత కళేబరమా..
నీ ముసలి లోకం పిలుస్తోంది.
నీకు జీవామృతాన్ని అందిస్తూ
ఇదిగో నా కరవాలం లోంచి
తూ ణిరం లోంచి జారుతున్నాయి
రెండు రక్తపు చుక్కలు.
లేచి నిలబడు చూద్దాం...!

23/3/15

No comments:

Post a Comment