విరించి ll కామన్ మాన్ ll
................................
అతడొక
పేరు చెక్కబడని సమాధి
కదన రంగ కవాతులో
అందరికన్నా ముందుండే బలిపీఠం
జీవితమనే ఉద్యమాన్ని
నెల జీతంలో కుదించుకునే
లౌక్యమెరుగని లోకజ్ఞాని
జీవితమనే పిడి వాదాన్ని
బతికుంటే చాలనుకునే
ఏక సూత్రంతో నెట్టుకుచ్చే
శృత పాండిత్య కాలజ్ఞాని
జీవితమనే ఉద్గ్రంధంలో
అతడొక చెదిరిపోయిన అథో జ్ఞాపిక
చదువుకున్న పుటవరకు గుర్తుగా
మడచి వుంచిన పేపర్ ముక్క
గతావశేషాల చిరిగిపోయిన పుస్తకంలో
కరిగిపోయిన అందాన్ని బాధ్యతగా మోసే
ఒంటి కన్ను నెమలీక
జ్ఞాపకాల శిలా విగ్రహంలో
నెర్రెలు తేలిన భాగాలకు
మరమ్మత్తులు చేసుకోలేని
చరిత్ర మలిచిన అనామక శిల్పి
సమాజమనే శాస్తవేత్త
కనుగొన్న మానవ యంత్రంలో అతడొక
యిరుసునుండి జారుతున్న కందెన చుక్క
జీవితాన్ని కవిత్వంలా వర్ణించలేక
ఊహల్లో తాదాత్మ్యం చెందే
ఒక యాదృచ్చిక ప్రతీక
నీలో నాలో
మనందరిలో
ఛాయా మాత్ర బేధంతో
మళ్ళీ మళ్ళీ పుట్టే
మృత శిశువు ధిక్కారం
ఈ కామన్ మాన్ ఆకారం
17/3/15
................................
అతడొక
పేరు చెక్కబడని సమాధి
కదన రంగ కవాతులో
అందరికన్నా ముందుండే బలిపీఠం
జీవితమనే ఉద్యమాన్ని
నెల జీతంలో కుదించుకునే
లౌక్యమెరుగని లోకజ్ఞాని
జీవితమనే పిడి వాదాన్ని
బతికుంటే చాలనుకునే
ఏక సూత్రంతో నెట్టుకుచ్చే
శృత పాండిత్య కాలజ్ఞాని
జీవితమనే ఉద్గ్రంధంలో
అతడొక చెదిరిపోయిన అథో జ్ఞాపిక
చదువుకున్న పుటవరకు గుర్తుగా
మడచి వుంచిన పేపర్ ముక్క
గతావశేషాల చిరిగిపోయిన పుస్తకంలో
కరిగిపోయిన అందాన్ని బాధ్యతగా మోసే
ఒంటి కన్ను నెమలీక
జ్ఞాపకాల శిలా విగ్రహంలో
నెర్రెలు తేలిన భాగాలకు
మరమ్మత్తులు చేసుకోలేని
చరిత్ర మలిచిన అనామక శిల్పి
సమాజమనే శాస్తవేత్త
కనుగొన్న మానవ యంత్రంలో అతడొక
యిరుసునుండి జారుతున్న కందెన చుక్క
జీవితాన్ని కవిత్వంలా వర్ణించలేక
ఊహల్లో తాదాత్మ్యం చెందే
ఒక యాదృచ్చిక ప్రతీక
నీలో నాలో
మనందరిలో
ఛాయా మాత్ర బేధంతో
మళ్ళీ మళ్ళీ పుట్టే
మృత శిశువు ధిక్కారం
ఈ కామన్ మాన్ ఆకారం
17/3/15
No comments:
Post a Comment