Wednesday, 1 April 2015

విరించి ll అనామక పుస్తకం ll
..........................................
పదాలు ఈ పుస్తకంలో ఎందుకనో
ఒక్కోసారి మరణిస్తుంటాయి
ఉరికంబం మీద వేలాడే
ఒంటరి శవాల్లా అగుపిస్తుంటాయి

కడుపు నింపని కాల్పనిక భారాల్ని
కుడి చేయి తోటి మోయలేక
వాస్తవంలోకి కొరడుగొట్టే జలపాతంలా
దూకి, పగిలి, చచ్చిపోవజూస్తుంటాయి

ఇపుడే తెలుస్తోంది..
ప్రిఆక్యుపేషన్ ప్రెజ్యుడైజెస్ అన్నీ
ప్రీ ప్లాన్డ్ గా కాలడ్డం పెట్టినప్పుడల్లా
ఎడమ చేతిలో ఎర్రగా కాగిపోయే
ఈ అనామక పుస్తకం లోకి
పదాలు పేలుతూ, కొత్తాత్మ కోసం
నా పాతాత్మని హత్యచేయజూస్తుంటాయి

18/3/15

No comments:

Post a Comment