Wednesday, 1 April 2015

విరించి ll అందం ll
....................... ...
రాత్రి
ఒట్టి అమాయకురాలు
దాని గడుసుదనమంతా
మన భయంలోనే

చెట్టు
భలే గడుసు పిండం
మొగ్గల్ని పూవుల్ని అందుకోనీవదు
అవి పండ్లయ్యేదాకా

అందం
ఒక అద్దం లాంటిది
చూసే కళ్ళలోనే
కళాయి పూత వుండాలి

మనిషి
ఒక తింగరోడు
మనసులో పెంచుకున్న అరణ్యంలోనే
దారి తప్పుతుంటాడు

జీవితం
ఒక ఉత్సవ ఊరేగింపు
ముందుకే తప్ప
వెనక్కి తిరగనిది

కవి
ఒక స్పందించగల కెమెరా
సమాజం వణికిపోతుంటే
తాను కాలి పోతుంటాడు.

26/2/15

No comments:

Post a Comment